సబ్బండ వర్గాల సంక్షేమమే మాజీ సీఎం కేసీఆర్ ద్యేయం..

– క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
నవతెలంగాణ-తొగుట
 సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని దుబ్బాక ఎమ్మెల్యే,జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం మండలం లోని వెంకట్రావుపేట, లింగాపూర్ చర్చి లలో జరి గిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం అంటేనే విభి న్న వర్గాలు,మతాలు, ప్రాంతాల కేంద్రమని,భిన్న త్వంలో ఏకత్వమే మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పుతుందన్నారు.ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చు పెట్టి కొందరు లబ్ది పొందాలని చూస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం లో అన్ని మతాలు, కులాల సమాన ప్రాధాన్యత ఇస్తూ మత సామరస్యాన్ని కాపాడుతూ గత ప్రభు త్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.గతంలో క్రైస్తవ సోదరుల అభివృద్ధి కోసం విదేశీ నిధులు వొచ్చేవని, నేడు కేంద్రం అడ్డుకట్ట వేయడం భావ్యం కాదన్నారు.హైదరాబాద్ లో క్రైస్తవ సోదరుల కోసం ప్రత్యేక భవనం నిర్మించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.క్రైస్తవ సోదరుల కోసం అభివృద్ధి కి నిధులు కేటాయిస్తా మని హామీ.ఇచ్చారు.అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర,సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్ష లు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను  పాస్టర్లు సత్యం, ఆంద్రయ్య, ఎబెలు శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి,సర్పంచ్ పాత్కుల లీలాదేవి వెంకటేశం, నాయకులు ఎం చంద్రారెడ్డి,బక్క కనకయ్య,పాల లక్ష్మణ్ గౌడ్, సుతారి రమేష్, డబ్బికారి పెంటోజీ, మాదాసు అరుణ్ కుమార్, పాత్కుల బాలయ్య, బండారు స్వామి గౌడ్, వెంకట్ రెడ్డి, సిరిసిల్లా రాజే శం, భాస్కర్ గౌడ్, సుభాష్ గౌడ్, తగరం అశోక్, గణేష్,బండారు రమేష్ గౌడ్, జహంగేర్,ప్రవీణ్,  తదితరులు పాల్గొన్నారు.