
ఘన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ చౌకస్తాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ జన హృదయ నేత సంక్షేమ సారాధి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా రైతాంగానికి అండగా రైతు ప్రభుత్వం అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది నిరూపించిన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిన రైతు భాందవుడు నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత వైయస్ రాజశేఖరరెడ్డి ఆని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రసాపుత్ సీతారామ్ నాయక్, మండల కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, సీనియర్ నాయకులు కణతల బుజ్జి నాగేందర్ రావు, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సాయి బాబు ,మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, బిసి సేల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు పడిదల సాంబయ్య, గ్రామ అధ్యక్షులు రమచంద్రపు వేంకటేశ్వర్ రావు, వేల్పుగొండ పూర్ణ, ఉపాధ్యక్షులు సింగపూరం కృష్ణ,మాజీ ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు,గుండేబోయిన నాగ లక్ష్మీ-అనీల్, చిక్కుల వెంకటేష్ మహిళ నాయకులు సుమలత, స్వరూప, సునీత, వజ్రామ్మ,మాజిత్, యూత్ నాయకులు వికాస్, గుండె రమేష్ మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు .