మాజీ సీఎం ఎన్టీఆర్ సేవలు మరువలేనివి

– హుస్నాబాద్ లో ఘనంగా 28వ వర్ధంతి 
– నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్
నవతెలంగాణ-  హుస్నాబాద్ రూరల్ 
మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఎన్టీ రామారావు 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఎన్టీ రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మనసుల్లో నిలిచాడని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాడని, ప్రజల హృదయాలలో చెరగని ముద్రగా ఎన్టీ రామారావు నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెరమండ్ల మల్లా గౌడ్, బత్తుల శంకర్, హాసన్ తదితరులు పాల్గొన్నారు.