
భువనగిరి జిల్లా కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ వడిచర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ 19వ వార్డు కౌన్సిలర్గా ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన స్వగృహంలో వారి కుటుంబ సభ్యులు దంపతులను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వడిచెర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ కౌన్సిలర్ గా, పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహకరించిన వార్డు ప్రజలకు పెద్దలకు సన్నిహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు . తెలియజేస్తున్నామని మీ ఆదరాభిమానాలు ప్రేమానురాగాలు ఎప్పటికీ ఇలానే ఉండాలని భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వడిచర్ల కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.