సీఎంను కలిసిన మాజీ డీఎస్పీ నళిని

సీఎంను కలిసిన మాజీ డీఎస్పీ నళినినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించిన సంగతి విదితమే. ఆమెకు తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశాన్నైనా ఆలోచించాలని ఆయన సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం గతంలో అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ముఖ్యమంత్రిని కలిశారు.