తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి శ్రీకాంత్‌ ముదిరాజ్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ముషీరాబాద్‌ చెందిన టీడీపీ సీని యర్‌ నాయకులు తలారి శ్రీకాంత్‌ ముదిరాజ్‌ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియ మితులైన సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఘనంగా సన్మానించారు. ఆదివారం ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ సారధ్యంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వచ్చేలా అంకిత భావం తో పనిచేస్తానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ”తమ పార్టీ అధినేత గతంలో రాష్ట్రంలో చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు.