చికిత్స పొందుతూ హైకోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతి..

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని కోటార్ ముర్ కు చెందిన హైకోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పొద్దుటూరి రవీందర్ రెడ్డి (63) చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. నెల రోజులుగా రవీందర్ రెడ్డి చెవి ఇన్ఫెక్షన్కు గురై చికిత్స తీసుకుంటూ ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ కు చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది.హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎం ఐ సి యూ లో అత్యంత క్రిటికల్ పొజిషన్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. కాగా పొద్దుటూరి రవీందర్ రెడ్డి అంత్యక్రియలు నేడు హైదరాబాదులోని ఆయన స్వగృహం అయినా డిసైడ్ ఫామ్ విడోస్, ఎల్జి విస్టాస్ కాలనీ, ప్లాట్ నెంబర్ 43 నుంచి నిర్వహించనున్నారు. మృతుడికి భార్య పి.సుచరిత రెడ్డి, కుమార్తెలు నిఖితారెడ్డి, లికిత రెడ్డి, అల్లుండ్లు రాజు రెడ్డి, వినయ్ రెడ్డిలు ఉన్నారు.పొద్దుటూరి రవీందర్ రెడ్డి 1992 సంవత్సరంలో జహీరాబాద్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మొదట విధుల్లో చేరారు. అక్కడి నుంచి సీనియర్ ఏపీపీ గా ఇందూరు జిల్లాలోని బోధన్ కోర్టుకు బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ కోర్టుకు ప్రమోషన్ పై అడ్మినిస్ట్రేషన్ పిపిగా రవీందర్ రెడ్డి బదిలీ అయ్యారు. అటు తరువాత అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1, గ్రేట్-2 గా ప్రమోషన్ పొంది హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో పనిచేశారు. నాలుగేళ్ల కిందట 2019 సంవత్సరంలో హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రిటైర్ అయ్యారు ఆయన మృతితో పట్టణంతో పాటు పెర్కిట్ కొటార్ మోర్ మామిడిపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయి..