టౌన్ షిప్ ను ప్రారంభించిన మాజీ జడ్పీవైస్ ఛైర్మెన్

నవతెలంగాణ – పెద్దవూర
పెదవూర మండల కేంద్రం లో నాగార్జున సాగర్ గుంటూరు, కోదాడ జడ్చర్ల జాతీయ రహదారీ ప్రక్కన మండల  స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా 08 ఎకరాల  23 గుంటల విస్తీర్ణం లో ఏర్పాటు చేసిన లక్ష్మి చంద్ర టౌన్ షిప్ ను, పిటిసిపీ లే అవుట్లను గురువువారం మాజీ జెడ్పి వెస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి ప్రారంచి, టౌన్ షిప్ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈసందర్బంగా లక్ష్మిచంద్ర టౌన్ షిప్ ఛైర్మెన్ బోయ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచి వాస్తు పద్దతిలో లే అవుట్లను తయారు చేశామని అన్నారు.ముందుగా ప్లాట్స్ బుక్ చేసుకున్న వారికీ రాయితీ ఇస్తున్నారని అన్నారు. 20 రోజుల వరకు ఈ రాయితీ కొనసాగుతుందని తెలిపారు. ప్లాట్ బుక్ చేసుకొని పూర్తి పేమెంట్ చేసిన వారికీ వెంటనే క్లియర్ టైటిల్ తక్షిణమే రిజిస్టేషన్ చేయించు కోవాలని తెలిపారు. అనంతరం కర్నాటి లింగారెడ్డిని షశాలువాతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు పుచ్చకాయల రమణారెడ్డి,కాంగ్రెస్ సినీయర్ నాయకులు ఊరె వెంకన్న,కర్నాటి వెంకట్ రెడ్డి, మధు సూదన్ రెడ్డి,జనారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.