నవతెలంగాణ – గీసుగొండ : వరంగల్ మహానర పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచెర్ల గ్రామానికి చెందిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం తల్లి వెంకటలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు.గురువారం పరకాల ,నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి ,పెద్ది సుదర్శన్ రెడ్డి సదానందం ను పరామర్శించి వెంకటలక్ష్మి పార్థివ దేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.