నవతెలంగాణ – ఆర్మూర్
జాతీయ స్థాయిలో భారత సేవ రత్న పురస్కారం అందుకున్న సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ లు అభినందనలు తెలిపారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాకి గర్వకారణమని ఇటువంటి సేవలు నేటి యువతరానికి స్పూర్తి దాయకం అని అన్నారు. ఎల్లప్పడూ మా వంతు సహకారం ఉంటుందని అన్నారు. పట్టణానికి చెందిన పలువురు నాయకులు సైతం తులసి పట్వారి సేవలకు అభినందించారు.