కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఆపదలో వారికి అన్ని విధాల అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని గంట్లకుంట గ్రామానికి చెందిన బండి బుచ్చమ్మ (68) వృద్ధాప్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కేతిరెడ్డి సోమనరసింహా రెడ్డి, సీనియర్ నాయకులు పాలకుర్తి యాదగిరి రావు, శ్రీరాం సుధీర్, మాజీ సర్పంచ్ చింతల భాస్కర్ రావు, మండల నాయకులు శ్రీరాం సంజయ్ కుమార్, కనుకుంట్ల వెంకన్న తదితరులు ఉన్నారు.