
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 2014 కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని నల్గొండ జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోంది…ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ నుంచి స్పందన లేదు..జగదీశ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లాంటి దగుల్భాజి గాడు కేసీఆర్ గారి లాగు ఇడిపిస్తా,బజారుకిడిస్తా అంటున్నాడు. ఇంకొ మంత్రి ఏమో BRSని వంద లోతల అడుగులో బొంద పెడతా అంటున్నాడు..ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.పరిపాలన చేతకాని రండలు కాంగ్రెస్ నేతలు,నాయకులు అని చెప్పారు.ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళను బొంద పెడతాం… అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.అధికారం కోసం అడ్డదారులు తొక్కే పార్టీ కాంగ్రెస్ నేతలు స్వరాష్ట్రం కోసం తెలంగాణను తెచ్చిన టిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని డిమాండ్ చేశారు.ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల చేేతుల్లో కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవు అని జగదీశ్ రెడ్డి చెప్పారు.కాంగ్రెస్ కు పొరపాటున ఓటేశాం అని ప్రజలు భాద పడుతున్నారని అన్నారు. అందరిని నట్టేట్ట ముంచిన దొంగలు కాంగ్రెస్ వాళ్లనీ అని తెలిపారు.ఉన్న నీళ్లను వాడుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని అన్నారు.కేసీఆర్ గారి ప్రశ్నలకు ఒక్క సమాధానం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 20 రోజులుగా గయబ్ అయిండని అన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి ప్రజల నుండి తప్పించుకు తిరుగుతున్నారని అని అన్నారు. జిల్లాలో మంత్రులు రైస్ మిల్లర్ల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అన్నదాతల నోటి కాడ ముద్ద తిన్న ఘానులు జిల్లా మంత్రులని అని ఘాటుగా విమర్శించారు. మంత్రులు ఢిల్లీకి కప్పం కడుతూ పదవులు కాపాడుకుంటున్నారని చెప్పారు.వ్యవసాయ రంగాన్ని పచ్చచగా మారుస్తే దాన్ని కుదిలు కుదేలు చేశారని తెలిపారు.అన్నదాతలు వ్యవసాయాన్ని నమ్ముకుంటే అప్పులపాలయ్యారని చెప్పారు. కేసులు,చేరికలు,రాజకీయాలు తప్ప కాంగ్రెస్ కు ఒక్క మంచి మాట రావడం లేదు జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ని భయపెట్టే మొగోడు ఇంకా పుట్టలేదు. రాష్ట్ర మ్యానిఫెస్టోకే దిక్కు లేదు.కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ మ్యానిఫెస్టో అంటూ హంగామా చేస్తున్నది అని అన్నారు.రాష్ట్రంలో చెప్పిన హామీలకే దిక్కు లేదు..ఇప్పుడు కొత్తగా హామీలు అంటూ కాంగ్రెస్ మోసం చేస్తుంది అని చెప్పారు.
చేనేతల పొట్ట కొట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం..
చేనేతల ఆత్మహత్యలకు కారణం అయ్యారు కాంగ్రెస్ వాళ్లని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేష్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి నల్గొండ యాదాద్రిభువనగిరి జిల్లాల బీఆర్ఎస్ పార్టీల అధ్యక్షులు రమావట్ రవీంద్ర కుమార్ కంచర్ల రమకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బూడిద బిక్షమయ్య గౌడ్ గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ చండూరు జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం చౌటుప్పల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ నారాయణపురం చౌటుప్పల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.