– ప్రజలు అంటే ఏనలేని ప్రేమ.. చెప్పింది చేస్తాడు: కక్కిరేణి శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్
నవతెలంగాణ – సూర్యాపేట
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 44వవార్డు కొత్త బస్టాండ్ వద్ద 5 లక్షల వ్యయం తో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ కార్యాక్రమాన్ని చేపట్టానని పేర్కొన్నారు.ప్రజలకు చేరువగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగ పడుతున్నదని తెలిపారు. స్థానికులతో కలియ తిరిగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం కాకుండా అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు.ఈ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుచూ గతంలో నాయకులు ఎన్నికల సమయంలోనే పట్టణాలకు వస్తే దామన్న మాత్రం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా దామన్న పని చేస్తున్నాడని తెలిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుచూ కోరిన వెంటనే తన వార్డులో 4 సంవత్సరాలనుండి ఉన్న డ్రైనేజీ కాల్వ సమస్య ను పరిష్కరించి ఐదు లక్షల రూపాయల తో స్లాబ్ నిర్మింపజేసిన దామన్న కు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, కౌన్సిలర్ లు బైరు శైలేందర్, కుంభం రాజేందర్, ఆనంతుల యాదగిరి,చిరివెళ్ల శభరీ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్రారర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.