
ఢిల్లీ వెళ్లిన సంధర్బంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఇంఛార్జి కేసీ వేణు గోపాల్ ని, ఏఐసీసీ కోశాధికారి పవన్ కుమార్ బన్సల్ ని మంగళవారం కలిశారు. వారిని కలిసిన సందర్భంగా రాష్ట్ర రాజకీయాల పైన చర్చించారు. తర్వాత ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఇంఛార్జి జనరల్ సెక్రటరీ మాణిక్ రావు ఠాక్రేని, ఏఐసీసీ సెక్రెటరీ ఇంఛార్జి రోహిత్ చౌదరిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల పైన ,కాంగ్రెస్ పార్టీ కార్యాచరణపైన చర్చించారు.