టీఏజీఏస్ క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీమంత్రి..

Former minister who unveiled the TAGS calendar.నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేల టీఏజీఎస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ను రూపొందించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఏజీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్యాలెండర్ లో పొందుపరిచిన చిత్రాలు, ఆదివాసుల ప్రాంతాల గురించి నాయకులు జోగు రామన్నకు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ జిల్లా అని జోగురామన్న అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్లో కుమురం భీంతో పాటు ఆదివాసుల చరిత్రలు, సంస్కృతిని చాటేల ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, లంక రాఘవులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మెట్టు ప్రహ్లాద్, సేవ్వ జగదీష్, అశోక్ స్వామి, ఉగ్గే విఠల్, వినోద్, వాఘ్మారే ప్రశాంత్ పాల్గొన్నారు.