మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి

– నవతెలంగాణ-సుల్తానాబాద్‌
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడు తున్నారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గ్రామపంచాయతీలో చిన్న ఉద్యోగంతో తన జీవనాన్ని ప్రారంభించారు ఆయన. అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రాజమల్లు భౌతిక కాయానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పూలమాల వేసి నివాళులర్పించారు.