యువతను అభినందించిన మాజీ ఎమ్మెల్యే

– యువత ఉపాధిని ఎంచుకోవడం అదృష్టంగా భావించాలి

– మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ నెల్లికుదురు : యువత ఏదో ఒక ఉపాధి ఉంచుకొని ముందుకు సాగడంపై యువతలను అభినందించినట్లు బి ఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరియు సతీమణి డాక్టర్ సీతామాలక్ష్మి తెలిపారు మండల కేంద్రంలో చిరు వ్యాపారం శివశంకర్ ఆటోమొబైల్ షాపును ఏర్పాటు చేసుకోవడం పట్ల బుధవారం ఆయనను ఘనంగా సత్కరించి కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు పోకుండా సన్మార్గం వైపు నడుస్తున్నందున మరియు చిన్న వ్యాపారం ఎంచుకోవడం ఉపాధి కోసం ఉద్యమించడం పట్ల ఈ శివశంకర ఆటోమొబైల్ నిర్వాహకులు కసర బోయిన మంజుల విజయ్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సత్కరించి స్వీటు తినిపించి మిఠాయిలు పంచే కార్యక్రమం నిర్వహించారు మీరు దిన దిన అభివృద్ధి చెందాలని ఆశీర్వదించినట్లు తెలిపారుఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి యాదగిరి రెడ్డి నాయకులు పరుపాటి వెంకటరెడ్డి ఎడ్ల మహేష్ రహిమాన్ రాజు శ్రీకాంత్ తోపాటు కొంతమంది పాల్గొన్నారు.