
మండలంలోని రామారెడ్డి, గొల్లపల్లి, మోషన్ పూర్, రాజమ్మ తండా లలో గురువారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు రైతులకు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి, జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించి తెలంగాణ అభివృద్ధిని మరింత సాధించుకుందామని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, భానూరి నర్సారెడ్డి, పాల మల్లేష్, రాజేందర్ గౌడ్, కడెం శ్రీకాంత్, పడిగల శ్రీనివాస్, జంగం లింగం, సంకిలింగం, రెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.