మండలంలోని డోన్గాం గ్రామములో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్వంత ఊరిలో తండ్రి మాదప్పా గారీ వర్దంతిని కుటుంబ సబ్యులతో కలిసి శనివారంనాడు ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా తండ్రి సమాది వద్ద ప్రత్యేకంగా భార్య శోభ, కుమారులు, తమ్ముడు , కుటుంబంతో కలిసి నిర్వహించి గ్రామస్తులకు తండ్రి ఙ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించారు. అనంతరం తండ్రి లేని లోటు ఒంటరి కుటుంబంగా ఉంటుందని , తండ్రి గారీ ఆశ్వీరచనం పొందేందుకు సంతృప్తిగా ఉందని షిండే అన్నారు. ఈ వర్దంతి కార్యక్రమంలో షిండే బార్య శోబా షిండే, తమ్ముడు గంగారాం షిండే, హరీష్ షిండే, కుటుంబ సబ్యులు తదితరులు పాల్గోన్నారు.