నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలను శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి శాలువా, మెమోటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులను పదవి కాలంలో చేసిన ప్రజా సేవను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ రాజు గౌడ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పంజుగులు శ్రీశైల్ రెడ్డి, వికారాబాద్ జడ్పీటీసీలు ప్రమొదిని, గౌడి మంజులా వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రిక్ విజరు లక్ష్మి, ఎంపీపీలు అనురాధ, బాలేశ్వర్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీలు స్వరూపా, అన్నపూర్ణ, తాండూరు పట్టణ అధ్యక్షుడు నయ్యూమ్ అఫ్ఫూ, మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, వీరేందర్ రెడ్డి, ఎంపీటీసీ విజరు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజప్ప గౌడ్, ఉమాశంకర్, రాంలింగా రెడ్డి, రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభా రాణి, కౌన్సిలర్ సంగీతా ఠాకూర్, మహిళా నాయకులు శకుంతల, అనురాధ తదతరులు పాల్గొన్నారు.