– విలేకర్ల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్
నవతెలంగాణ – అచ్చంపేట
భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గొడవలను ప్రోత్సహిస్తూ ఉసిగొలుపుతున్నాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్ ఆరోపించారు అంబేద్కర్ ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో జరిగిన సంఘటనలో టిఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎక్కడ లేని విధంగా వేరుశనగ పంటకు అధిక ధర చెల్లిస్తూ కమిషన్ దారులు కొనుగోలు చేస్తున్నారని, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా కొందరు టిఆర్ఎస్ నాయకులు గొడవ సృష్టించి, చైర్మన్ భర్త అంతటి మల్లేష్ పై, మార్కెట్ కార్యదర్శి పై దాడి చేశారని ఆరోపించారు. గిట్టుబాటు ధర లభించకపోతే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు రైతులకు ఉంది. మార్కెట్ యార్డులో పంటలకు కొనుగోలు పైన రాజకీయం చేయడం తగదన్నారు. ఫర్నిచర్ ధ్వంసం చేయడం, జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు నష్టం కలగకుండా ప్రజాపాలన లక్ష్యం అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన అనుచరులకు సంకేతాలు ఇస్తూ.. ఘర్షణ వాతావరణం సూచించడం సిగ్గుచేటు అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికంగా అచ్చంపేట మార్కెట్ యార్డులోని నీరసంగా క్వింటాల్ ధర రూపాయలకు కొనుగోలు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. వీడియోలు ఫోటోలు ఆధారంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. పట్టణంలోని భ్రమరాంబ దేవాలయ ఉత్సవాల్లో కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉద్దేశపూర్వకంగా గొడవలకు దారి తీసాడని అన్నారు. భవిష్యత్తు కాలంలో పంటల కొనుగోలు పైన ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట అనంతరెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారావు, నరసయ్య యాదవ్, రఫీ, తదితరులు ఉన్నారు.