వరి పంటకు రూ 500 వెంటనే అందించాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

 నవతెలంగాణ- రామారెడ్డి

 రైతులను ఆదుకుంటామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వరి క్వింటాలుకు రూ 500 వెంటనే అందించాలని సోమవారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 9 నుండి వరి క్వింటాలుకు రూ 500 చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం, యాసంగి పంట కైనా రూ 500 బోనసందించి, వెంటనే రూ రెండు లక్షలు రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. రైతులను చైతన్య పరుస్తూ, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. రైతుల పక్షాన పోరాడుతూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఓ యజ్ఞం గా తీసుకొని రైతులకు అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్,నారాయణరెడ్డి ,  గ్రామ అధ్యక్షులు భానురి నర్సారెడ్డి, నాయకులు రాజేందర్ గౌడ్, లింబాద్రి నాయక్, పాల మల్లేష్, జంగం లింగం, కొత్తొల్ల గంగారం, సంకి లింగం, కుశంగి రాజనర్సు, దండ బోయిన సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.