మీచౌంగ్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే మెచ్చా

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల సంభవించిన మీచౌంగ్ తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మూడు రోజులపాటు కుండపోత వర్షాలకు నష్టపోయిన పంటలను ఆయన శుక్రవారం మండలంలోని జమ్మి గూడెం లో పరిశీలించారు. దెబ్బతిన్న ధాన్యాన్ని, నష్టపోయిన తోటను పరిశీలించారు. సంబంధిత అధికారులు పంటలను క్షేత్రస్థాయిలో అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యం అయినంత త్వరలో బాధిత రైతులకు నష్టపరిహారం అందేవిధంగా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్.పి.టి.సి పైడి వెంకటేశ్వరరావు, మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి యు.ఎస్ ప్రకాష్, నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, గుడవర్తి వెంకటేశ్వరరావు, సోయం వీరభద్రం, దొడ్డ రమేష్, దారా యుగంధర్ తదితరులు ఉన్నారు.