మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 

నవతెలంగాణ – కంటేశ్వర్

హైదరాబాద్ లోని వాసవి కన్యక పరమేశ్వరి గుడి హాల్ లో హెచ్ హెచ్ & సేవ సంస్థ వారు నిర్వహించినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆకుల లలిత-రాఘవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అందుకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అన్ని విషయాలు తెలుసుకొని, అన్ని రంగాలతో పాటు అన్ని విషయాలలో ముందుండాలని పిలుపునిచ్చారు .