
నిడమానూరు మండలం, మార్లగడ్డ క్యాంప్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ గొడ్తి శ్రీనివాస్ గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం వలన మరణించారు. వారికి భారత రాష్ట్ర సమితి పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందడం వలన వారికి మంజూరైన బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను సోమవారం నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ గొడ్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు రూ.2,00,000 రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు తాటి సత్యపాల్, బీఆర్ఎస్ నాయకులు బొల్లం రవి, నల్లబోతు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ విజయ్, మద్దిపూడి శ్రీనివాస్ రావు, వైట్ల శ్రీనివాస్, జొన్నలగడ్డ వెంకట్ రెడ్డి, బూడిద గోవింద్ , కూరాకుల వెంకటేశ్వర్లు, గున్రెడ్డి వంశీ రెడ్డి, గొడ్తి నవీన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.