చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

Former MLA Nomula Bhagat presented the checkనవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం,పొట్టేవానితండా గ్రామానికి చెందిన క్యాగ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ముడావత్ శివాజీ నాయక్ గత ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ లో సభత్వం ఉండడం తవలన  మృతునికి మంజూరైనా రూ.2,00,000 రూపాయలు చెక్కు ను నాగార్జున సాగర్ మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్ మంగళవారం  పొట్టే వానితండా లోని శివాజీ నాయక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి తల్లిదండ్రులకు మృతుని సతీమణి పావని కి అందజేశారు. ఈ సందర్బంగా భగత్ మాట్లాడుతూ మీ కుటుంబానికి అండగా నేనుంటానని,అలాగే బీఆర్ఎస్ పార్టీ లో సభ్యత్వం తీసుకున్న ప్రతిఒక్కరికి పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జాటావత్ రవి నాయక్, మండల యూత్ నాయకుడు మెండే సైదులు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు రమావత్ రవి నాయక్, మాజీ ఉప సర్పంచ్ విజయ్ దసృ నాయక్,వినోద్ నాయక్, రమేష్,రాజు,భాషా,అశోక్, చంద్రశేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు.