
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు సంబందించిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్ల స్థల పట్టాల హద్దులను తక్షణమే గుర్తించి ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని బాధితులతో కలిసి సోమవారం ఎమ్మార్వో సరోజ పావనికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంఎల్ఏ నోముల భగత్ మాట్లాడుతూ.. గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గానికి రూ.200 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్తేనే పనులవుతాయని స్వయంగా అధికారులే చెప్పడం దుర్మార్గమైన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కొని వాళ్ల నోటి కాడి ముద్దను లాగొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఏ ప్రభుత్వం అయినా దళితులు, గిరిజనులకు ఇచ్చిన స్థలాలను వారికే కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు జాటావత్ రవి నాయక్, మాజీ సర్పంచ్ మెండే సైదులు, రామావత్ రవి నాయక్ , మాజీ సర్పంచ్లు శ్రీను, క్రిష్ణయ్య,ఎస్టి సెల్ అధ్యక్షులు రవి నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు చెన్ను వెంకట్ రెడ్డి, పాల్తీ శంకర్ నాయక్, నక్క ముత్యాలు, హరి నాయక్,శ్రీనివాస్ చారి, నాయకులు శశిధర్ రెడ్డి,చంద్రయ్య, వెంకటయ్య దశ్రు నాయక్,బాష నాయక్, సీతారాం నాయక్, రాజు నాయక్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.