
పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముత్యాల యాదగిరి ఇటీవల ప్రమాదవ శాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.సోమవారం నగార్జున సాగర్ మాజీ శాసన సభ్యులు నోముల భగత్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్, పిండ్యాల కొండల్ రావు, పాక్స్ మాజీ డైరెక్టర్ పొదిల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ తరి వెంకటయ్య, ఉప సర్పంచ్ జనార్దన్ రావు,ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి నాయక్, శ్రీకర్ నాయక్,లక్ష్మణ్ రావు,పెండ్యాల వెంకటేశ్వర రావు, చింతల అంజి,రెడ్డి యాదయ్య, పెండ్యాల వెంకటేశ్వర రావు, మద్దూరి శ్రీను, ఎలిజాల అంజి, ఈసం కొండల్, ముత్యాల రాజు, తరి నాగరాజు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.