నవతెలంగాణ – మల్హర్ రావు/మహాముత్తారం
మంథని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ బుధవారం మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. చిన్నారులను పలకరిస్తూ,ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్ర నిర్వాహకులతో మాట్లాడిన ఆయన సమీపంలోనే బొమ్మరిల్లు ఆటలు ఆడుతున్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. బిడ్డా ఏం చేస్తున్నారని అడిగితే అన్నం కూరలు వండుతున్నామని చెప్పడంతో వాటిని చూపించాలని కోరారు. దీంతో చిన్నారులు సరదాగా వండిన వంటకాలను ఆయనకు చూపించారు.ఏం చదువుతున్నారని, ఏ స్కూల్ అంటూ పలకరించి ఆ చిన్నారులతో ఫోటో దిగడంతో చిన్నారులు ఆనందంలో తేలిపోయారు.