
మూడు రోజుల క్రితం ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ మొగిలి పాక ప్రకాష్ ను మాజీ ఎమ్మెల్యే సునీత యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి సంబంధిత డాక్టర్లు డాక్టర్ కమలేష్, డాక్టర్ శ్రీనివాస్ తో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఇంటర్నల్ ఇంజురీస్(గాయాలు) ఏమీ లేవని, బాడీ అంతా సిటీ స్కాన్ చేయించామన్నారు. కాలిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని డాక్టర్లు వివరించారు. ప్రకాష్ త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపి వారు. మాజీ ఎమ్మెల్యే తుఫాన్ రామాజీపేట సర్పంచ్ మొగలిపాక రమేష్ నిత్యం అంటే మూడు రోజులుగా పేషంట్ తోనే ఉంటూ కావాల్సిన సేవలు అందిస్తున్నారని తెలిపారు.