మృతుడి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

– రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల, జగన్నాధ పురం కు చెందిన ఆరే శ్రీనివాసరావు (52) ద్విచక్ర వాహనంపై మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెం సమీపం లోని చల్లావారి గూడెం ఆర్ అండ్ ఆర్ కాలనీ నుండి స్వగ్రామం వెళుతున్నాను. అశ్వారావుపేట మండలం వినాయకపురం నారాయణపురం మార్గంలో మూల మలుపు వద్ద ప్రమాదానికి గురై క్రింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.కొద్ది సేపటి తర్వాత ఆ మార్గంలో వెళుతున్న ప్రయాణికులు శ్రీనివాసరావును గుర్తించి చిట్టితల్లి అంబులెన్స్ లో అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న ఎస్సై శ్రీరాముల శ్రీను సంఘటన వివరాలు సేకరించి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి
ఆరె శ్రీనివాసరావు మృతి సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వెలేరుపాడు చేరుకుని శ్రీనివాసరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా పాడె మోసి స్నేహాన్ని చాటుకున్నారు.