మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ లో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. హుస్నాబాద్ పట్టణం లో వడ్డేపల్లి రమణ కూతురు శ్రీజ , గడిపే లక్ష్మి మృతి చెందాగా కుటుంబ సభ్యులను పరమశించి కుటుంబానికి మనో ధైర్యాన్ని చెప్పారు.మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడుని కోరారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్, కౌన్సిలర్ బొజ్జ హరీష్, చిట్టి గోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగం మధుసూదన్ రెడ్డి, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, వైస్ చైర్మన్ అనిత రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.