హుస్నాబాద్ లో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరామర్శించారు. పట్టణంలోని అరెపల్లెకు చెందిన నమ్మిలికొండ రాజయ్య తండ్రి మృతి చెందారు. మహమ్మదాపూర్ గ్రామంలో పిట్టల రాములు ఇటివల మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు, వారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగం మదన్మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, అక్కన్నపేట మాజీ జెడ్పిటిసి భూక్య మంగ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.