మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Former MLA visited the family members of the deceasedనవతెలంగాణ – నూతనకల్
ఇటీవల మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామనికి చెందిన  బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, రైతు కమిటీ కోఆర్డినేటర్ పులుసు వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్ మృతుని సతీమణి మాజీ సర్పంచ్ పులుసు మంజులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకన్న మృతి పార్టీకి తీరని లేటు అని అతను పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు చూడి లింగారెడ్డి  మాజీ సర్పంచ్ కొంపల్లి రాంరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు పులుసు లింగ మల్లయ్య నాయకులు, బత్తుల సాయిల్ గౌడ్, కొచ్చర్ల బాబు బత్తుల విద్యాసాగర్ రామసాని మల్లారెడ్డి. రేసు వెంకటేశ్వర్లు మహేశ్వరం మల్లికార్జున్,బిక్కి బుచ్చయ్య బత్తుల విజయ్ కొనతం కృష్ణారెడ్డి. తదితరులు ఉన్నారు.