మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని బేజుగాం చెరువు తండా  మాజీ సర్పంచ్ భర్త హరిలాల్ ఇటీవలే గుండెపోటుతో మరణించడంతో విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ తండాకు చేరుకొని మాజీ సర్పంచ్ మంగ్లీని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు దుర్గారెడ్డి, రాజిరెడ్డి , శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.