నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వై గోవింద్ నూతనంగా నిర్మించిన ఇంటి నూతన గృహ ప్రవేశ శుభ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహప్రవేశ శుభ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యేకు వై గోవింద్ శాలువతో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట బిచ్కుంద మండల బీఆర్ఎస్ నాయకులు మద్నూర్ మండలం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.