
నవతెలంగాణ – కోహెడ
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ ఓర్చుకోలేక ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎనిమిది నెలల కాలంలో సుమారు 9 వందల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారన్నారు. అలాగే హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణకు 17 కోట్లు వచ్చాయన్నారు. మహిళలకు ఉచితబస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వందలకే గ్యాస్, మహిళలకు డాక్రా రుణాలు, రుణమాఫీ లాంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ చేయలేని పనులను కాంగ్రెస్ పార్టీ చేసిందని దుయ్యబట్టారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.