నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ టీచర్ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం పూర్వ నాయకులు బి మోహన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తిరిగి అధికారంలోకి రానున్న బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రభుత్వ సారధ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపై కలిసి పని చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.