సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్  

– అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిక
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆటువంటి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవడం జరిగింది. డి రాజేశ్వర్ రావు మూడుసార్లు ఎమ్మెల్సీగా ఒకసారి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా, తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు చేపట్టడం జరిగింది. అయితే తిరిగి సొంతగూటికి వెళ్లడం జరిగింది.