నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకింది మంజూర్ మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ బుధవారం రాయపోల్ లో మంజూరును పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంజూరు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చిన తాము వెంటనే స్పందించి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. గత 30 సంవత్సరాల నుంచి పదవి ఉన్న లేకున్నా పేదల పక్షాన ఉంటూ కృషి చేయడం జరుగుతుందన్నారు. పేదలకు సేవ చేయడంతోనే సంతోషం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే రాయపోల్ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పేదలకు ఎలాంటి ఆపద వచ్చిన తనకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే పార్టీలకు అతీతంగా మానవత్వమే లక్ష్యంగా పనిచేస్తూ పేదల పక్షాన ఉంటామని ఆయన పేర్కొన్నారు.