కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించండి: మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్ 

జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని, పెన్షనర్స్ హక్కులు సాధించాలని మాజీ ఎమ్మెల్సీ భట్టాపూర్ మోహన్ రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు,పెన్షనర్స్ కి అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్స్ కి ఐదవ తారీకు వేతనాలు అందిస్తుందని, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా అలాగే అందిస్తుందని తెలిపారు. ఎంపీగా జీవన్ రెడ్డి గెలవగానే ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడని అన్నారు. సమస్యలపై కొట్లాడే వ్యక్తి జీవన్ రెడ్డి అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.