కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి శనివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమనీ, అండగా నిలబడేందుకే కాంగ్రెస్‌లో చేరామని వారి పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా మొదటి తారీకునే ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు, ఏకీకృత సర్వీసు రూల్స్‌ సాధిస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.