
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువుల్లోకి, కుంట్ల లోకి నీరు చేరింది. గంగమ్మ వాగు వద్ద వాహనాలు వెళ్లడానికి ప్రమాదంగా ఉండడంతో ఎస్ ఐ విజయ్ కుండా ఆధ్వర్యంలో రోడ్డును బ్లాక్ చేశారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు నత్త నడకన నిర్వహిస్తున్నారని, వాగు ఉధృతంగా పారడం తో, మండల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్న పనులు నత్తనడకన నడుస్తున్నాయని, ఆర్ అండ్ బి, ఎమ్మెల్యే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, గత ప్రభుత్వంలో మంజూరైన పనులను నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం, అసమర్థత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోతే ఆర్ అండ్ బి, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడించడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు గురిజాల నారాయణరెడ్డి, పడిగెల శ్రీనివాస్, ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ గంగారం, బొమ్మిడి రామ్ రెడ్డి, జంగం లింగం, కన్నాపూర్ మాజీ సర్పంచ్ రాజనర్సు, పోతు నూరి ప్రసాద్., కూడెల్లి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.