ఆర్థిక సహాయం చేయడంలోనే తృప్తి.. మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

నవతెలంగాణ-డిచ్ పల్లి
పేదలు నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయడంలోనే తనకు తృప్తి ఉందని, తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు ఆయన దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే తనవంతుగా పదివేల రూపాయలు, గన్నరం గ్రామంలోని పందేన ముదిరాజ్ తర్పకు పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి బుధవారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కాసుల కవిత గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఆర్థిక పరిస్థితి బాగా లేక భర్త బతుకు దేరువు కోసం గల్ఫ్ వేళ్ళడని, మృతురాలికి చిన్న పిల్లలు ఉండటంతో మానవత దృక్పథంతో అ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. గ్రామంలో ముదిరాజ్ కుల సంఘా భవనం నిర్మాణంకు డబ్బులు లేక పనులు నిలిచిన విషయాన్ని ఇమ్మడి గోపి దృష్టికి తీసుకొని వచ్చారు. దీంతో తనవంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ముదిరాజ్  కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.