నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
బుదవారం నాడు మండల కేంద్రంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు పంట నష్ట పరిహారం చెల్లించాలని రోడ్డుపై బైఠాయించారు. వీరికి మాజీ ఎంపీపీ సంఘీభావం తెలిపి ఆయన మాట్లాడుతూ మండలంలో భారీ వర్షాలు కురిషి పంటలు నష్టం వాటిల్లిందని దింతో ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఇతర జిల్లాలో ప్రభుత్వ యంత్రంగం పంట నష్ట నివారణ చర్యలు చేపడుతున్న మాదిరిగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వే చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.