రాజ్యసభ సభ్యులు మందడి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులోని ఆయన నివాసంలో భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి నుచ్చు నాగయ్య యాదవ్, చీమల కొండూరు గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.