హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపకు మాజీ ఎంపీపీ విరాళం 

నవతెలంగాణ పెద్దకోడప్ గల్

హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపకు మాజీ ఎంపీపీ విరాళం ఇచ్చారని అంజనీ భారతమాత యువసేన అధ్యక్షుడు రమేష్ రావు తెలిపారు. ప్రతి హిందూ కార్యక్రమం లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తే మాజీ ఎంపీపీ గారు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు తనవంతుగా 50 వేల రూపాయలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు. అంతా మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి గారు మాట్లాడుతూ యువత శివాజీ మహారాజ్ను ఆదర్శం తీసుకొని ఉజ్వల భవిష్యత్తు సంపాదించుకోవాలని సూచించారు కార్యక్రమంలో రమేష్ రావు, శ్యామ్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్, సాయిబాబా గౌడ్, గంగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.