నవతెలంగాణ – పెద్దవంగర: ప్రజల మన్ననలు పొందేలా అధికారులు విధులు నిర్వహించాలని వడ్డెకొత్తపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సాయిని ఝాన్సీ రవి అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహించి, ఇటీవల బదిలీపై వెళ్లిన శివరాత్రి మురళి ని సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులకు బదిలీలు సహజమని, ఎక్కడ విధులు నిర్వహించిన అంకితభావంతో సేవలందించాలన్నారు. గ్రామాభివృద్ధిలో మురళి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ రాజు కుమార్, అంగన్వాడీ టీచర్ సుకన్య, కారోబార్ పరుశరాములు, ఆశ వర్కర్ హేమలత, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్, సీఏ నిర్మల సత్యం, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.