బాల భవన్ లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – నల్లగొండ
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా సూర్యాపేట బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సభ్యులు హమీద్ ఖాన్ చేతుల మీదుగా అబ్దుల్ కలామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసు నుండే శ్రమించే తత్వం అలవడాలి అని ఒక పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్ జీవిత చరిత్రను చూస్తే తన అనేది లేకుండా దేశం ఖ్యాతి కోసం జీవించిన తీరు పిల్లలకు అవగాహన కల్పించాలి అని అన్నారు. ఎందరో మహానుభావులు వారి నిజ జీవితంలో ఎలాంటి అవకాశాలు వసతులు లేకున్నా పోరాడుతూ కొనసాగి లక్ష్యాలను సాధించారని గుర్తు చేశారు. గుప్పిట్లో ప్రపంచం అన్నట్టు మొబైల్ ఫోన్ నెట్ ఈ రోజుల్లో అందరికీ సాధారణం కాబట్టి ఆ నెట్ ను ఉపయోగించి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి, మంచి ఆలోచన అలవడే అంశాలను అధ్యయనం చేయాలి అన్నారు. ఎందరో సక్సెస్ అయిన చరిత్రలను అధ్యయనం చేయాలి. పిన్న వయసునుండే, శ్రమించే తత్వం, లక్ష్య సాధన ఈ రెండు వుంటే సక్సెస్ మన తొడే వుంటుందని కలాంను ఆదర్శంగా తీసుకొని యువత ముండుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ భవన్ స్టాఫ్, జ్ఞాన సరస్వతి టీమ్ బుర్రి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సత్యనారాయణ గారు,తదితరులు పాల్గొన్నారు.