– నివాళి అర్పించిన పలువురు
నవతెలంగాణ-ములకలపల్లి
బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాలకుర్తి ప్రసాద్ శనివారం ఉదయం గుండె నొప్పి రావడంతో స్వగృహం పొగళ్లపల్లిలో మృతి చెందాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ములకలపల్లి మండలంలో ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి పాలకుర్తి ప్రసాద్. తెలంగాణ సిద్ధించాక మండల అధ్యక్షుడిగా పని చేసిన ఘనత ఆయనకి చెందుతుంది. ఆయన పార్థివదేహాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సందర్శించి, ఆయన భౌతిక కాయాన్నికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కనకయ్య మాట్లాడారు. పార్టీలకతీతంగా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి పాలకుర్తి ప్రసాద్ స్నేహ శీలి, మృదుస్వభావి అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అన్నారు. అలాగే పాలకుర్తి ప్రసాద్‌కు మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. మండలంలో బీఆర్‌ఎస్ పార్టీని దృఢంగా చేసిన వ్యక్తి పాలకుర్తి ప్రసాద్ అని, ప్రతి ఇంటికీ బీఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు చేర్చిన వ్యక్తి అని అన్నారు. ఆయన లేని లోటు పార్టీకి పూడ్చలేనిదన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసి, కుటుంబానికి అండగా ఉంటామని అని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు దిండిగల రాజేందర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మొరంపూడి అప్పారావు, తెలుగుదేశం తేళ్ల చెన్నయ్య, సీపీఐ నాయకులు నరాటి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీ నాయకులు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, వూకంటి రవికుమార్, పువ్వల మంగపతి శనగపాటి సీతారాములు, చందర్రావు, శనగపాటి రవి, బెక్కుమల్ల సుధాకర్, పామర్తి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తదితరులు నివాళులు అర్పించారు.